నేడు చిత్తూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన

* విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట చేరుకోనున్న జగన్ * శ్రీకాళహస్తి మండలం ఊరందూరులో పేదలకు ఇళ్లపట్టాల పంపిణీ * 160 ఎకరాల్లో 5,768 మందికి స్థలాల కేటాయింపు

admin
Published on: 28 Dec 2020 7:11 AM IST
నేడు చిత్తూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన
X

ఏపీ సీఎం జగన్ ఇవాళ చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. శ్రీకాళహస్తి మండలం ఊరందూరు సమీపంలోని విష్ణు కెమికల్స్‌ వద్ద వేసిన లే అవుట్‌లో సీఎం జగన్‌ పేదలకు పంపిణీ ఇళ్ల పట్టాలను చేయనున్నారు. మొత్తం 160 ఎకరాల్లో 5 వేల 768మందికి స్థలాలను కేటాయించారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో సీఎం జగన్‌ ఉదయం 10 గంటల 45 నిమిషాలకు రేణిగుంటకు చేరుకుంటారు.

అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఊరందూరుకు సభాస్థలికి చేరుకుని.. 11 గంటల 20 నిమిషాలకు పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం ఊరందూరులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. లబ్ధిదారులకు పట్టాలు అందజేస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు తిరుగు ప్రయాణమవుతారు.

admin

admin

Next Story