AP Assembly: అసెంబ్లీ ముట్టడికి టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తల యత్నం

*పోలీసుల వలయాన్ని ఛేదించుకుని అసెంబ్లీకి టీఎన్ఎస్ఎఫ్ నేతలు *అసెంబ్లీకి వచ్చే మార్గంలో విద్యార్ధి సంఘాల నేతల అరెస్ట్

Shilpa
Published on: 18 Nov 2021 12:24 PM IST
TNSF Activists Attempted to Storm the AP Assembly
X

అసెంబ్లీ ముట్టడికి టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తల యత్నం(ఫోటో- ది హన్స్ ఇండియా)

AP Assembly: ఏపీ అసెంబ్లీ ముట్టడికి పలువురు టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు యత్నించారు. పోలీసుల వలయాన్ని ఛేదించుకుని అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీ ప్రధాన మార్గం వరకూ వచ్చి నినాదాలు చేశారు.

విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటుంటే నిరసన తెలిపే హక్కు విద్యార్థులకు లేదా అని మండిపడ్డారు. ఎయిడెడ్ విద్యా వ్యవస్థను నాశనం చేసే ప్రభుత్వ జీవోలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

Shilpa

Shilpa

Next Story