తిరుపతి అలిపిరి వద్ద మరోసారి నిఘా వైఫల్యం.. అన్య మతానికి సంబంధించిన పేర్లతో వాహనం...

Tirupati: టీటీడీ విజిలెన్స్ సిబ్బంది గుర్తించకపోవడంపై భక్తుల మండిపాటు...

Shireesha
Updated on: 17 April 2022 3:15 PM IST
Tirupati Vigilance Department Failed to Stop the Vehicle with Religious Names at Alipiri
X

తిరుపతి అలిపిరి వద్ద మరోసారి నిఘా వైఫల్యం.. అన్య మతానికి సంబంధించిన పేర్లతో వాహనం...

Tirupati: తిరుమల అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద మరోసారి టీటీడీ విజిలెన్స్ అధికారుల వైఫల్యం బయటపడింది. అన్య మతానికి సంబంధించిన పేర్లతో తమిళనాడుకు చెందిన ఓ కారు తిరుమలలో ప్రత్యక్షమైంది. కారులో అన్యమతానికి సంబంధించిన చిహ్నాలు ఉన్నా... టీటీడీ విజిలెన్స్ సిబ్బంది గుర్తించకపోవడంపై భక్తులు మండి పడుతున్నారు. తిరుమలలోని ఎస్‌.ఎన్.సీ ప్రాంతంలో కారు సంచరిస్తున్నా విజిలెన్స్ సిబ్బంది పట్టించుకోకుండా వదిలి పెట్టేశారు.

తిరుమలలో ఎటువంటి అన్యమత, పార్టీ గుర్తులకు సంబంధించిన జెండాలను, గుర్తులు కలిగిన వాహనం రాకూడదని నిబంధనలు ఉన్నా టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ఆ నిబంధనలను అనుసరించకుండా వాహనాలను వదిలేస్తున్నారు.

Shireesha

Shireesha

Next Story