Tirupati: గత ఎన్నికల్లో ఛీకొట్టిన వారిలో మార్పు రాలేదు- సజ్జల

Tirupati: తిరుపతి ఉపఎన్నికల సందర్భంగా వైసీపీపై టీడీపీ, బీజేపీ దుష్ప్రచారం చేస్తున్నాయని వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు.

Arun Chilukuri
Published on: 15 April 2021 3:34 PM IST
Tirupati: Sajjala Ramakrishna Reddy Slams TDP BJP Leaders
X

Tirupati: గత ఎన్నికల్లో ఛీకొట్టిన వారిలో మార్పు రాలేదు- సజ్జల

Tirupati: తిరుపతి ఉపఎన్నికల సందర్భంగా వైసీపీపై టీడీపీ, బీజేపీ దుష్ప్రచారం చేస్తున్నాయని వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. అధికారంలో ఉన్నంత కాలం టీడీపీ,బీజేపీలు ప్రజలకు ఏం చేశాయో చెప్పలేకపోతున్నారన్నారు. గత ఎన్నికల్లో ఛీకొట్టిన వారిలో మార్పు రాలేదన్నారు. ప్రత్యేక హోదాపై ఎందుకు పోరాడలేదంటే టీడీపీ సమాదానం లేదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తక్కువ సమయంలోనే సీఎం జగన్ సంక్షేమ పథకాల్లో కొత్త ఒరవడి సృష్టించారని సజ్జల చెప్పారు. టీడీపీ, బీజేపీకు తిరుపతి ఉపఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కవన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story