రెడ్ జోన్ గా రాయల్ చెరువు.. చంద్రబాబును అక్కడకు వెళ్లొద్దంటూ పోలీసుల నోటీసులు

Rayala Cheruvu: చంద్రబాబు తిరుపతి పర్యటన వివాదాస్పదంగా మారుతోంది.

Arun Chilukuri
Published on: 24 Nov 2021 4:03 PM IST
Tirupati Rayala Cheruvu as a Red Zone
X

రెడ్ జోన్ గా రాయల్ చెరువు.. చంద్రబాబును అక్కడకు వెళ్లొద్దంటూ పోలీసుల నోటీసులు

Rayala Cheruvu: చంద్రబాబు తిరుపతి పర్యటన వివాదాస్పదంగా మారుతోంది. ఇటీవల వర్షాలకు అత్యంత ప్రమాదకరంగా మారిన రాయల్ చెరువును ప్రభుత్వం రెడ్ జోన్ గా ప్రకటించింది. ఈ సమయంలో పరామర్శలకు వెళ్లొద్దని నేతలకు సూచనలు చేసింది. రాయల్ చెరువు కట్ట తెగితే కనీసం వంద గ్రామాలకు ముప్పు ఉంటుందని అధికారులు గతంలో అలెర్ట్ కూడా చేశారు. వరద ముంపులో బాధలు పడుతున్న తమను ఆదుకోలేదని మంత్రులపై నిన్న స్థానికులు తిరగబడ్డారు.

ఈరోజు చంద్రబాబు అదే ప్రాంతానికి పర్యటనకు వెళుతుండగా అది రెడ్ జోన్ అనీ ఆ ప్రాంతంలో పర్యటనలు నిషిద్ధమని పోలీసులు తెలిపారు. ఈ మేరకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు నానికి నోటీసులుకూడా ఇచ్చారు. అయినా చంద్రబాబు రాయల చెరువు వెళ్లేందుకు బయల్దేరడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story