Tirupati Lok Sabha Election Result 2021: రేపు తిరుపతి ఉప ఎన్నిక ఫలితం

Tirupati Lok Sabha Election Result 2021 : తిరుపతి బై పోల్‌ రిజల్ట్‌ కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

Arun Chilukuri
Updated on: 1 May 2021 10:16 PM IST
Tirupati Lok Sabha Election Result 2021 : Counting of votes in Nellore, Tirupati tomorrow
X

రేపు తిరుపతి ఉప ఎన్నిక ఫలితం

Tirupati Lok Sabha Election Result 2021 : తిరుపతి బై పోల్‌ రిజల్ట్‌ కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరికొన్ని గంటల్లోనే అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. కౌంటింగ్‌ కోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. నెల్లూరు జిల్లా పరిథిలోని సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్‌ను నెల్లూరులోని డీకేడబ్ల్యూ కాలేజీలో ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఓట్ల లెక్కింపు సంబంధించి జిల్లా కలెక్టర్‌తో పాటు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇక ఓట్ల లెక్కింపులో పాల్గొనే సిబ్బందికి కరోనా టెస్టులు చేసి నెగిటివ్‌ వస్తేనే విధుల్లోకి తీసుకుంటున్నారు. కరోనా నేపథ‌్యంలో గెలిచిన అభ్యర్థుల హడావుడి ఎక్కువగా లేకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.

ఇక ఇప్పటికే పలు సర్వేలు తిరుపతి ఉప ఎన్నికలో అధికార పార్టీదే విజయమని అంచనా వేశాయి. టీడీపీ మెజార్టీ కూడా గతం కంటే మెరుగు పడే అవకాశాలు కనిస్తున్నాయి. ఇక కమలదళం తన ప్రభావాన్ని చాటుకునేందుకు దిన్నే వేదికగా భావించింది. దీంతో రేపు ఎలాంటి ఫలితం వస్తుందోనని అన్ని పార్టీలు ఉత్కంఠగా ఎదురుస్తున్నాయి.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story