నేడు తిరుపతి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఎన్నికలు

Tirupati: ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ, టీడీపీ

Jyothi
Published on: 20 July 2022 8:21 AM IST
Tirupati Co-operative Town Bank Elections Today
X

నేడు తిరుపతి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఎన్నికలు

Tirupati: తిరుపతి కో- ఆపరేటివ్‌ టౌన్‌ బ్యాంక్‌ ఎన్నికలు కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం రెండు గంటల వరకు ఓటింగ్ జరగనుంది. పోలింగ్‌‌కు సంబంధించిన ఏర్పాట్లను సహకారశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. 12 మంది డైరెక్టర్లకు వైసీపీ- టీడీపీలు అభ్యర్థులను నిలబెట్టారు. సహకార రంగానికి చెందిన సిబ్బందితో పాటు వార్డ్‌ అమ్యూనిటీస్‌ని కూడా ఎన్నికల్లో వినియోగించుకుంటున్నారు.

మధ్యాహ్నం రెండు గంటలకు ఓటింగ్‌ ముగిసిన తర్వాత మూడు గంటలకు కౌంటింగ్‌ ప్రారంభమవుతుంది. కౌంటింగ్‌ పూర్తి అయిన తర్వాత గెలుపొందిన అభ్యర్థులను పేర్లను ఎన్నికల అధికారి ప్రకటిస్తారు. గతవారం రోజుల నుంచి వైసీపీ, టీడీపీ పోటాపోటీగా ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఓటర్లను పోలింగ్‌ సెంటర్‌‌కు రప్పించడానికి ఇరు పార్టీల ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి.

Jyothi

Jyothi

Next Story