Tirupati by Poll: తిరుపతిలో కాపు నేతల రహస్య భేటీ !

Tirupati by Poll: తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని కాపు నేతలు రహస్య సమావేశం నిర్వహించినట్లు సమాచారం.

Kranthi
Published on: 7 March 2021 5:35 PM IST
Tirupati by Poll Secret Meeting of Kapu Leaders in Tirupati
X

ఇమేజ్ సోర్స్: గూగుల్


Tirupati by Poll: తిరుపతిలో కాపుల రహస్య సమావేశం అయ్యారు. తిరుపతి బై పోల్ లక్ష్యంగా ఆ సామాజికవర్గం ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అస్సలే ఏపీ రాజకీయాలు కాకపుట్టిస్తున్న సమయంలో వీరి భేటీ అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో బీజేపీ వారు జనసేనకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని..లేదంటే ఏ పార్టీకీ ఓటు వేయకుండా నోటాను ఎంచుకోవాలని తిరుపతి బలిజ సంఘాలు తీర్మానించాయనే వార్త సంచలనం సృష్టిస్తోంది. తిరుపతి పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాలకు చెందిన దాదాపు 250 మంది కీలకమైన బలిజ నేతలు ఈ రహస్య సమావేశానికి హజరైనట్లు టాక్.

అధికార పార్టీకి చెందిన రెడ్డి సామాజిక వర్గం నేతలు తమను అణిచివేస్తున్నారనే ఆగ్రహంతో ఉన్నారట బలిజ సామాజికవర్గం నేతలు. టీడీపీ ప్రభుత్వ హయంలో బలిజల కోసం తిరుపతి ఎల్ఐసీ సెంటర్ రోడ్ లో భూమిని కేటాయించి.. భవన నిర్మాణానికి నిధులు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేస్తున్నట్లు చెబుతున్నారు.

Kranthi

Kranthi

Next Story