Tirumala: సంపన్న దేవుళ్ల జాబితాలో శ్రీ వేంకటేశ్వరుడే టాప్.. బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లు ఎన్నో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Tirumala: సంపన్న దేవుళ్ల జాబితాలో శ్రీ వేంకటేశ్వరుడే టాప్.. బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లు ఎన్నో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
Tirupati Temple’s Assets: సంపన్న దేవుడంటే అనంత పద్మనాభ స్వామేనా..? లేక కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరుడేనా..? అనే సందేహం కలుగక మానదు.
Tirupati Temple’s Assets: సంపన్న దేవుడంటే అనంత పద్మనాభ స్వామేనా..? లేక కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరుడేనా..? అనే సందేహం కలుగక మానదు. అనంత పద్మనాభుడి నేలమాళిగల్లో దొరికిన విలువైన బంగారం కన్నా... తానే సంపన్నుడిని అంటున్నాడు శ్రీ వేంకటేశ్వరుడు. వేల కోట్ల ఆస్తులు, టన్నుల కొద్దీ బంగారం... కోట్ల రూపాయల ఫిక్స్‌డ్ డిపాజిట్లతో సంపన్న దేవుళ్ల జాబితాల్లో శ్రీనివాసుడే టాప్... అంటూ టీటీడీ గణాంకాలు చెబుతున్నాయి. అసలు టీటీడీ పేరిట ఉన్న ఆస్తులు ఎన్ని.....? శ్రీవారి పేరుపై బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లు ఎన్నో... తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.
శ్రీ వేంకటేశ్వరుడు కొలువైన దివ్యక్షేత్రం తిరుమల భక్తులతో నిత్యం కిటకిటలాడుతుంటుంది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్యా క్రమేపీ పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం రోజుకు 90 నుంచి లక్ష మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. దీంతో హుండీ ఆదాయం సైతం పెరుగుతూ వస్తోంది. టీటీడీ వార్షిక బడ్జెట్ సైతం ప్రతి ఏడాది కనీసం 100 కోట్ల రూపాయలు పెరుగుతూ వస్తోంది. ప్రతి యేటా హుండీ ఆదాయంతోపాటు తలనీలాలు. సేవ... ఆర్జిత సేవా టిక్కెట్లు. బ్రేక్. ప్రత్యేక ప్రవేశ దర్శనాలు. విరాళాలు. లడ్డూ ప్రసాదాల విక్రయం. గదుల కేటాయింపు ద్వారా టీటీడీకి ఆదాయం సమకూరుతోంది.
లాక్‌డౌన్ కారణంగా శ్రీవారి హుండీ ఆదాయం గణనీయంగా తగ్గుముఖం పట్టింది. టీటీడీ బడ్జెట్ అంచనా ప్రకారం 1100 కోట్ల రూపాయల హుండీ ద్వారా ఆదాయం లభిస్తుందని భావించిన టీటీడీకి... కేవలం 721 కోట్ల రూపాయలు మాత్రమే ఆదాయం సమకూరింది. దీంతో టీటీడీ వార్షిక బడ్జెట్ సైతం రివైజ్ చేసి 2 వేల 553 కోట్లకు కుదించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి 2 వేల 837 కోట్ల రూపాయలు వస్తుందని అంచనా వేసింది పాలక వర్గం... 2021-22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌పై సుదీర్ఘ చర్చ జరిపి ఆమోదం తెలిపింది. 2021 - 22 ఆర్థిక సంవత్సరానికి 2 వేల 937 కోట్ల 85 లక్ష రూపాయలకు పాలకమండలి సభ్యులు పచ్చజెండా ఊపారు. 2023 - 24 ఆర్థిక సంవత్సరానికి 4 వేల 411 కోట్ల 68 లక్షల బడ్జెట్‌కు టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదించింది.
శ్రీవారి హుండీ ఆదాయం వరుసగా నెలకు 100 కోట్ల మార్కు దాటుతోంది. దీంతో హుండీ ద్వారానే ఏడాదికి 1200 కోట్ల నుంచి 1300 కోట్లు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. శ్రీవారికి భక్తులు సమర్పించే తలనీలాల ద్వారా ఏడాదికి 150 నుంచి 170 కోట్లు సమకుతోంది. శ్రీవారి లడ్డూ ప్రసాదం... ఆర్జిత సేవా టిక్కెట్లు... గదుల కేటాయింపు... డొనేషన్లు... బ్యాంకులో డిపాజిట్ చేసిన నగదుకు వడ్డీల రూపంలో అదనంగా కొని వందల కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉంది. ప్రధాన ఆదాయ వనరు హుండీ కాగా.... తలనీలాలు రెండో స్థానంగా చెప్పుకోవచ్చు.
శ్రీవారి హుండీలో సమర్పించే నగదులో కొంత భాగాన్ని కార్పస్ ఫండ్‌గా వివిధ బ్యాంకుల్లో 2022 సెప్టెంబర్ నాటికి ఉన్న డిపాజిట్లు చేసింది. ఆ వివరాలను టీటీడీ వెల్లడించింది. స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియాలో 5 వేల 358 కోట్ల 11 లక్షలు, యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియాలో ఒక వేయి 694 కోట్ల 25 లక్షలు, బ్యాంక్ అఫ్ బరోడాలో ఒక వేయి 839 కోట్ల 36 లక్షలు, కెనరా బ్యాంకులో ఒక వేయి 351 కోట్లు, ఆక్సిస్ బ్యాంకులో ఒక వేయి 6 కోట్ల 20 లక్షలు ఉన్నట్లు టీటీడీ పేర్కొంది. హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌లో 2 వేల 122 కోట్ల 85 లక్షలు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో 779 కోట్ల 17 లక్షలు, గవర్నమెంట్ అఫ్ ఇండియా బాండ్స్ ద్వారా 555 కోట్ల 17 లక్షలు డిపాజిట్ చేసినట్లు శ్వేతపత్రంలో పేర్కొన్నారు.
పంజాబ్ నేషనల్ బ్యాంకులో 660 కోట్ల 43 లక్షలు, పంజాబ్ అండ్ సింద్ బ్యాంకులో 306 కోట్ల 31 లక్షలు, ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంకులో 101 కోట్ల 43 లక్షలు, ఇండియన్ బ్యాంకులో 25 కోట్ల 30 లక్షలు, ఐసీఐసీఐ బ్యాంకులో 9 కోట్ల 70 లక్షలు, సప్తగిరి గ్రామీణ బ్యాంకులో 99 కోట్ల 91 లక్షలు ఉన్నట్లు తెలిపారు. యునైటెడ్ కమర్షియల్ బ్యాంకులో ఒక వేయి 839 కోట్ల 36 లక్షలు, సెంట్రల్ బ్యాంక్ అఫ్ ఇండియాలో కోటి 28 లక్షలు ఉన్నాయి. కరూర్ వైశ్యా బ్యాంకులో 4 కోట్ల 37 లక్షలు డిపాజిట్ చేశారు. ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్‌లతో 4 కోట్లు, ఏపీ స్టేట్ కో ఆప్షన్ బ్యాంకులో కోటి 30 లక్షలు ఉన్నట్లు స్పష్టం చేశారు. 2022 వరకు మొత్తం డిపాజిట్ చేసిన నగదు 15 వేల 938 కోట్ల 68 లక్షలు ఉందని శ్వేతపత్రంలో పేర్కొన్నారు.
బంగారం డిపాజిట్లపై కూడా శ్వేతపత్రంలో 2022 సెప్టెంబర్ వరకు గణాంకాలు వెల్లడించారు టీటీడీ అధికారులు. స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియాలో 9 వేల 819 కిలోలు, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకులో 439 కిలోల బంగారం ఉంది. 2022 సెప్టెంబర్ నాటికి 10 వేల 258 కిలోల బంగారం డిపాజిట్ ఉందని టీటీడీ తన శ్వేతపత్రంలో పేర్కొంది.
తాజాగా అంతర్జాతీయ ఆలయాల సమావేశంలో టీటీడీ పరిపాలనపై ఈవో ధర్మారెడ్డి పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ఇచ్చారు. శ్రీవారికి నిత్యం అలంకరించే బంగారు ఆభరణాలు 1.2 టన్నులు ఉన్నట్లు వెల్లడించారు వెండి 10 టన్నులు ఉన్నాయన్నారు. 17 వేల కోట్ల రూపాయలను బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు వెల్లడించారు. 11 టన్నుల బంగారాన్ని డిపాజిట్ చేశామన్నారు. టీటీడీ పరిధిలో 6 వేల ఎకరాల అటవీ ప్రాంతం ఉందని చెప్పారు ఈవో ధర్మారెడ్డి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



