Tirupati: అచ్చెన్నాయుడు సంచలన ప్రకటన

Tirupati: తిరుపతి ఉప ఎన్నికలో టీడీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.

Arun Chilukuri
Published on: 29 March 2021 4:12 PM IST
Tirupati: Atchannaidu Sensational Announcement
X

Tirupati: అచ్చెన్నాయుడు సంచలన ప్రకటన

Tirupati: తిరుపతి ఉప ఎన్నికలో టీడీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. వైసీపీకి ఓటు వేయకపోతే పథకాలు రావంటూ భయపెట్టే వాలంటీర్ల ఆగడాలను బయటపెట్టాలని అన్నారు. ఈ నంబర్ కు సమాచారాన్ని అందించాలంటూ 7557557744 వాట్సాప్ నంబర్ ను ప్రకటించారు. ఈ నంబర్ కు కాల్ రికార్డు కానీ, ఫొటో కానీ వాట్సాప్ చేస్తే ఆ వ్యక్తుల అకౌంట్ లోకి రూ. 10 వేలు వేస్తామని చెప్పారు.

తిరుపతి లోక్ సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు ఇది వర్తిస్తుందని అన్నారు. వాలంటీర్ల బాగోతాన్ని బయటపెట్టే వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తిరుపతిలో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిని గెలిపించి జగన్‌కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story