తిరుమలలో శ్రీవారి మెట్టు మార్గం ప్రారంభం..
Srivari Mettu: తిరుమలలో శ్రీవారి మెట్టు మార్గాన్ని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు.
తిరుమలలో శ్రీవారి మెట్టు మార్గం ప్రారంభం..
Srivari Mettu: తిరుమలలో శ్రీవారి మెట్టు మార్గాన్ని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులకు శ్రీవారి మెట్టుమార్గంలో అనుమతి ఉంటుందన్నారు. గత నవంబర్‌లో కురిసిన కుండపోత వర్షాలకు తిరుమల మెట్ల మార్గం, ఘాట్ రోడ్ పూర్తిగా ధ్వంసంకాగా టీటీడీ యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టింది. భక్తులకు ఎలాంటి అసౌర్యాలు కలగకుండా టీటీడీ చర్యలు చేపడుతుందన్నారు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, టీటీడీ అధికారులు, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. తిరుమలలో ఏడాది తర్వాత మెట్లమార్గం తిరిగి అందుబాటులోకి రావడంతో నడకదారి భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Next Story




