TTD: భక్తులకు టీటీడీ శుభవార్త

Tirumala Tirupati Devasthanams Management Increased Sarva Darshan Tokens
x

టీటీడీ (ఫైల్ ఫోటో)

Highlights

* శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల సంఖ్య పెంచిన టీటీడీ * 8వేలకు టోకెన్లను పెంచిన అధికారులు

TTD: సర్వదర్శనం టోకెన్ల సంఖ్యను పెంచుతూ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు చిత్తూరు జిల్లాకు చెందిన వారికే 2వేల టోకెన్లు ఇచ్చేవారు. ప్రస్తుతం ఈ సంఖ్యను 8వేలకు పెంచి అన్ని ప్రాంతాల వారికి అవకాశం కల్పించారు. శ్రీవారి దర్శనానికి భక్తుల నుంచి అనూహ్యంగా డిమాండ్ పెరగడంతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. ఆధార్ కార్డు కలిగి ఉన్న ప్రతి భక్తుడు సర్వదర్శనం టోకెన్ పొందే అవకాశం కల్పించారు. ఏ రోజుకు సంబంధించిన టోకెన్లు ఆరోజు తెల్లవారుజాము నుంచి శ్రీనివాసంలో జారీ చేస్తామని అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories