Tirumala: రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం.. ఒక్క నెలలోనే..

Tirumala Hundi: రెండేళ్ల తర్వాత తిరుమల శ్రీవారి ఆలయ హుండీ ఆదాయం వంద కోట్లు దాటింది.

Arun Chilukuri
Updated on: 7 April 2022 4:45 PM IST
Tirumala Tirupati Devasthanam Receives Rs 128 Crores Hundi Income In March 2022
X

Tirumala: రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం.. ఒక్క నెలలోనే..

Tirumala Hundi: రెండేళ్ల తర్వాత తిరుమల శ్రీవారి ఆలయ హుండీ ఆదాయం వంద కోట్లు దాటింది. మార్చి నెలలో హుండీ ద్వారా 128 కోట్ల 81 లక్షల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. కరోనా కారణంగా రెండేళ్లలో టీటీడీ ఆదాయం భారీగా తగ్గింది. ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గడంతో మార్చి నుంచి తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరుగుతోంది. మార్చి నెలలో 19 లక్షల 72 వేల 741 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా, 9.54 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కోటి 11 లక్షల లడ్డూలను విక్రయించినట్లు టీటీడీ తెలిపింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story