Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఈ నెల 8న శ్రీవారి ఆలయం మూసివేత..

Tirumala Temple To Be Closed For 12 Hours Due To Lunar eclipse November 8th
x

Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఈ నెల 8న శ్రీవారి ఆలయం మూసివేత.. 

Highlights

Tirumala News: నవంబర్ 8న చంద్రగ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయం తలుపులు మూసివేయనున్నారు.

Tirumala News: నవంబర్ 8న చంద్రగ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయం తలుపులు మూసివేయనున్నారు. నవంబర్ 8న ఉదయం 8 గంటల 30 నిముషాల నుంచి సాయంత్రం 7 గంటల 20 నిముషాల వరకు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. బ్రేక్ ద‌ర్శనం, శ్రీ‌వాణి, రూ.300/- ప్రత్యేక ప్రవేశ ద‌ర్శనం, ఇత‌ర ఆర్జిత సేవ‌ల‌ను అన్నీ రద్దుచేసింది టీటీడీ.. గ్రహణం కారణంగా నవంబరు 8వ తేదీ తిరుప‌తిలో జారీ చేసే ఎస్ఎస్‌డీ టోకెన్లు రద్దు చేశారు.

అయితే, గ్రహణ సమయం ముగిసిన తర్వాత వైకుంఠం 2 నుండి మాత్రమే భ‌క్తుల‌ను అనుమ‌తిస్తారు. తిరుమ‌ల‌లోని మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్నప్రసాద భ‌వ‌నం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఇత‌ర ప్రాంతాల్లో కూడా అన్నప్రసాద విత‌ర‌ణ ఉండ‌దు. తిరిగి రాత్రి 8.30 గంటల నుండి భక్తులకు అన్నప్రసాద వితరణ ప్రారంభమవుతుందని టీటీడీ స్పష్టం చేసింది. కావున‌ భ‌క్తులు ఈ విషయాన్ని గమనించి, అసౌకర్యానికి గురికాకుండా త‌మ తిరుమల యాత్రను తదనుగుణంగా రూపొందించుకోవాల‌ని టీటీడీ మ‌రోసారి విజ్ఞప్తి చేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories