Tirumala: ఇవాళ శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల విడుదల

Tirumala: నవంబర్‌, డిసెంబర్‌ నెలలకు టికెట్లు విడుదల

Sandeep Eggoju
Updated on: 22 Oct 2021 1:27 PM IST
Tirumala Temple Special Darshanam Tickets Release Today
X

తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం టిక్కెట్లు విడుదల (ఫైల్ ఇమేజ్)

Tirumala: ఇవాళ శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ. నవంబర్, డిసెంబర్ నెలలకు సంబంధించిన 3 వందల రూపాయల టికెట్లను ఉదయం 9 గంటల నుంచి అందుబాటులోకి తీసుకురానుంది. రోజుకు 12 వేల చొప్పున టికెట్లు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచనుంది టీటీడీ. రేపటి నుంచి సర్వదర్శనం టికెట్లు అందుబాటులోకి రానుండగా రోజుకు 10వేల చొప్పున టికెట్లు విడుదల చేయనున్నారు. ఇక నవంబర్ నెలకు సంబంధించిన గదుల బుకింగ్ ను ఈనెల 25 నుంచి అందుబాటులో ఉంచనుంది టీటీడీ.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story