Tirumala Tickets: శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్..నేడు ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల..పూర్తి వివరాలివే

Tirumala Tickets: తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్. డిసెంబర్ నెలలో స్వామివారి దర్శనానికి సంబంధించిన టికెట్లను టీటీడీ ఇవాళ విడుదల చేయనుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 24 Sept 2024 8:39 AM IST
Tirumala Srivari special darshan tickets released today
X

Tirumala Tickets: శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్..నేడు ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల..పూర్తి వివరాలివే

Tirumala Tickets: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్న భక్తులకు ముఖ్య గమనిక. ఎన్నో రోజులుగా శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూస్తున్నభక్తులకు టీటీడీ నేడు డిసెంబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక దర్శనం టికెట్లను విడుదల చేయనుంది.

డిసెంబర్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి స్పెషల్ దర్శనం టోకెన్లను ఇవాళ ఉదయం 10గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది టీటీడీ.

తిరుమల, తిరుపతి డిసెంబర్ నెల గదుల కోటాను నేడు మధ్యాహ్నం 3గంటలకు ఆన్ లైన్లో టీటీడీ రిలీజ్ చేయనుంది. ఈనెల 27న ఉదయం 11గంటలకు శ్రీవారి సేవ కోటా, అలాగే నవనీత సేవ, పరకామణి సేవ టికెట్లు ఆన్ లైన్లో విడుదల చేయనున్నారు.

శ్రీవారి దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలనుకున్న భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవచ్చని అధికారులు కోరారు. ప్రతినెలా స్వామివారి ఆర్జిత సేవలు, దర్శనాలతోపాటు వసతి గదుల ఆన్ లైన్ కోటాను కూడా విడుదల చేస్తారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story