Tirupati: ఈ నెల 25న తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

Tirupati: సూర్యగ్రహణం కారణంగా ఆలయాన్ని మూసివేయనున్నట్లు ప్రకటించిన టీటీడీ

Rama Rao
Updated on: 13 Oct 2022 6:47 PM IST
Tirumala  Sri Venkateswara Temple Will be Closed on 25th of this Month
X

Tirupati: ఈ నెల 25న తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

Tirupati: ఈనెల 25న సూర్యగ్రహణం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయాన్నిమూసివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈనేపథ్యంలో సర్వ దర్శనం మినహా మిగతా ప్రత్యేక దర్శనాలు, ఇతర వెసులుబాటు దర్శనాలు నిలిపేస్తున్నట్టు వెల్లడించింది. అంతేకాకుండా ఆ రెండు రోజుల్లో అన్నప్రసాదం కాంప్లెక్స్‌లో భోజనం వితరణ వుండదని టీటీడీ స్పష్టంచేసింది. సూర్యగ్రహణం సందర్భంగా 25న ఉద‌యం 8:11 నుండి రాత్రి 7:30 గంట‌ల‌కు శ్రీ‌వారి ఆల‌య ప్రధాన ద్వారం మూసివేయనున్నారు. ఆతర్వాత ఆలయాన్ని తెరచి ఆలయ శుద్ధి కార్యక్రమం తర్వాత భక్తుల ధర్శనానికి అవకాశం కల్పించనున్నట్లు టీటీడీ తెలిపింది. భక్తులు ఈవిషయాన్ని గమనించి సహకరించాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Rama Rao

Rama Rao

Next Story