చిన శేష వాహనంపై శ్రీవారు

చిన శేష వాహనంపై శ్రీవారు
x

Tirumala Brahmotsavamlu

Highlights

Tirumala Brahmotsavam : శనివారం ప్రారంభమైన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు(ఆదివారం) ఉదయం మలయప్ప స్వామి

Tirumala Brahmotsavam : శనివారం ప్రారంభమైన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు(ఆదివారం) ఉదయం మలయప్ప స్వామి, చిన శేషవాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. తొలిరోజు పెద శేషవాహనంపై ఉభయ దేవేరులతో దర్శనం ఇచ్చిన స్వామి.. నేడు ఏకాంతంగా దర్శనం ఇచ్చారు. మలయప్ప స్వామిని దర్శించుకుంటే కుండలినీ యోగసిద్ధి ఫలం లభిస్తుందని ప్రతీతి. ఈ కార్యక్రమాల్లో భాగంగా స్వామివారికి వేదపారాయణం, దివ్యప్రభందగోష్టి నిర్వహించారు. కాగా కరోనా కారణంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలను భక్తులెవరూ లేకుండానే నిర్వహిస్తున్నారు. తిరుమల చరిత్రలోనే శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఇలా ఏకాంతంగా నిర్వహించడం తొలిసారి కావడం గమనార్హం..

ఈ బ్రహ్మోత్సవాల్లో టీటీడీ ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు డీపీ అనంత కుమార్‌, శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. కరోనా నిబంధనల ప్రకారం ఉత్సవాలను కేవలం ఆలయానికే పరిమితం చేశారు. ఇక అటు రాత్రి 7 నుంచి 8 గంటల వరకు హంస వాహనసేవ జరగనుంది. మొత్తం ఈ బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 19 నుంచి 27వ తేదీ వరకు జరుగనున్నాయి. వాహనసేవలన్నీ సంపగి ప్రాకారంలోని కల్యాణమండపంలో, ఉత్సవమూర్తులకు అలంకరణ, కొలువు, ఆస్థానం, సల్లింపు, శాత్తుమొర, స్నపన తిరుమంజనం వంటి కార్యక్రమాలను రంగనాయకమండపంలో నిర్వహించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories