Tirumala: చిన్నశేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన మలయప్ప స్వామి

Tirumala Brahmotsavam Chinna Sesha Vahanam
x

Tirumala: చిన్నశేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన మలయప్ప స్వామి

Highlights

Tirumala: మల్లయప్ప స్వామిని దర్శనానికి భారీగా భక్తుల రాక

Tirumala: తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకిగా భావిస్తారు. శ్రీవైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే భక్తులకు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి. మల్లయప్ప స్వామి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీవారి మాడవీధుల్లో ప్రదర్శించిన సంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories