ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్‌

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 9 Jun 2024 11:27 AM IST
Time has been fixed for Chandrababu oath taking as AP CM
X

ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్‌ అయింది. ఈ నెల 12న కృష్ణాజిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో ఉదయం 11 గంటల 27 నిమిషాలకు ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు.. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోడీ సహా ఇతర ప్రముఖులు హాజరుకానున్నారని, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో VVIP లు, VIP లు తదితర ప్రముఖుల విమానాలు, హెలికాప్టర్లకు తగిన పార్కింగ్‌ ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అలాగే.. ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యే కేంద్ర, రాష్టరాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, తదితర వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ నీరబ్‌ కుమార్ ప్రసాద్ ఆదేశించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story