10th Class Exams: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్

10th Class Exams: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Arun Chilukuri
Published on: 9 April 2021 9:42 PM IST
Time Extended for 10th Class Exams in Andhra Pradesh
X

10th Class Exams: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్

10th Class Exams: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలు రాసే సమయాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి, ద్వితీయ, తృతీయ భాష పరీక్షలకు సమయాన్ని పొడిగించారు. గణితం, సామాజిక శాస్త్రం, భౌతికశాస్త్రం, జీవశాస్త్రం పరీక్షలకు అరగంట సమయాన్ని పెంచారు.

ఒకేషనల్ కోర్సు పరీక్షకు రెండు గంటల సమయం కేటాయించారు. కంపోజిట్ కోర్సులోని రెండో భాష పేపర్-2కి గంటా 45 నిమిషాలు కేటాయించారు. అటు, భాషలు, గణితం, సామాజిక శాస్త్రానికి 100 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. భౌతికశాస్త్రం, జీవశాస్త్రంలో 50 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story