Tiktok Bhargav: 'ఆ ఫొటోలు డిలీట్ చేయండి.. ఆ మైనర్‌ని నేను కాదు': OMG నిత్య

Tiktok Bhargav: తెలుగు రాష్ట్రాల్లో ఫన్ బకెట్ భార్గవ్ రేప్ కేసులో అరెస్ట్ అయిన ఘటన సంచలనంగా మారింది.

Venkata Chari
Published on: 20 April 2021 7:37 PM IST
Please Delete Photos on Youtube says OMG Nithya
X
OMG నిత్య (ఫొటో ఇన్‌స్టాగ్రాం)

Tiktok Bhargav: తెలుగు రాష్ట్రాల్లో ఫన్ బకెట్ భార్గవ్ రేప్ కేసులో అరెస్ట్ అయిన ఘటన సంచలనంగా మారింది. ఇతను టిక్ టాక్‌లో చేసిన ఓమైగాడ్ వీడియోలు బాగా ఫేమస్. ఇందులో ఓమైగాడ్ ఓమైగాడ్ అంటూ భార్గవ్‌తో కలిసి చేసింది నిత్య అనే అమ్మాయి.

కాగా, ప్రస్తుతం భార్గవ్ 14 ఏళ్ల మైనర్‌ని రేప్ చేసిన కేసులు అరెస్టయిన విషయం తెలిసిందే. సదరు మైనర్ బాలికను టిక్ టాక్ వీడియోల పేరుతో నమ్మించి వంచించాడనే వార్తలు బయటకు వచ్చాయి. దీంతో చాలామంది ఓఎమ్‌జీ నిత్య ఫొటోలు వాడుతూ ట్రోల్ చేస్తున్నారు. దీంతో చాలా యూట్యూబ్ ఛానల్స్‌లో నిత్య ఫొటోలు తెగ తిరుగుతున్నాయి.

దీంతో రంగంలోకి దిగిన నిత్య.. అసలు ఈ కేసుకి నాకు సంబంధం లేదు.. నాపై వస్తున్న వార్తల్లో నిజం లేదంటూ తన తల్లితో కలిసి ఓ వీడియోను విడుదల చేసింది. 'అయితే ఈ ఇష్యూలో చాలామంది నా పేరు, నా ఫొటోలు వాడుతున్నారు. దయచేసి వాటిని డిలీట్ చేయాలని కోరుతున్నా. మీకు రెండు రోజుల్లో అసలు నిజాలు ఏంటో తెలుస్తుందని' వీడియోలో పేర్కొంది.


Venkata Chari

Venkata Chari

Next Story