విజయనగరం జిల్లాలో పులి కలకలం

Vizianagaram: దొర్లపాలెం సమీపంలో పులి సంచారం

Sriveni Erugu
Published on: 14 Aug 2022 3:12 PM IST
Tiger in Vizianagaram
X

విజయనగరం జిల్లాలో పులి కలకలం

Vizianagaram: విజయనగరం జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. ఎస్.కోట మండలం దొర్లపాలెం, కాపు సొంపురం పొలిమేరల్లో పులి కనిపించడంతో భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ సిబ్బంది. ఘటన స్థలానికి చేరుకుని పులి జాడలను గుర్తించారు. ఇటీవల ఎల్.కోట మండలం మల్లివీడు గ్రామ సమీపంలో అర్ధరాత్రి రోడ్డు దాటుతుండగా వాహనదారులకు పులి కనిపించింది. తాజాగా దొర్లపాలెం సమీపంలో మరోసారి పులి కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచించారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story