Anakapalle: అనకాపల్లి జిల్లాలో మళ్లీ పులి హల్‌చల్

Anakapalle: సబ్బవరం మం. నల్లరేగులపాలెంలో 3 రోజుల నుంచి పశువులపై దాడి

Jyothi
Updated on: 12 Sept 2022 10:55 AM IST
Tiger Hulchul In Anakapalle District
X

Anakapalle: అనకాపల్లి జిల్లాలో మళ్లీ పులి హల్‌చల్

Anakapalle: అనకాపల్లి జిల్లాలో పులి సంచారం భయాందోళనకు గురిచేస్తోంది. సబ్బవరం మండలం నల్లరేగులపాలెంలో మూడు రోజుల నుంచి పశువులపై దాడి చేస్తుంది. విజయ రామసాగరం సమీపంలో గేదెను చంపింది. మేతకు వెళ్లిన మరో రెండు ఆవులు తిరిగి రాలేదని స్థానికులు చెబుతున్నారు. దీంతో అటవీ శాఖ సిబ్బంది రంగంలోకి దిగారు. పెద్దపులి అడుగు జాడలను గుర్తించారు. ఉన్నతాధికారుల సూచన మేరకు రెండు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సబ్బవరం మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరించారు. మరోవైపు మండలంలో మళ్లీ పులి సంచారం మొదలు కావడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

Jyothi

Jyothi

Next Story