కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో మళ్లీ పులి సంచారం

Kakinada: కొత్త వజ్రకూటం దొడ్ల డెయిరీ వద్ద ఆటోడ్రైవర్‌కు కనిపించిన పులి

Jyothi
Published on: 12 Jun 2022 9:22 AM IST
Tiger Fear in Kakinada District
X

కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో మళ్లీ పులి సంచారం

Kakinada: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ప్రజలను పులి భయం ఇంకా వీడడం లేదు. పులి ఏదో దిక్కున కనిపించి హడలెత్తిస్తుంది. అటవీశాఖ అధికారులకు చిక్కకుండా జనాలకు కనిపిస్తూ గుండెల్లో గుబులురేపుతోంది. తాజాగా శంఖవరం మండలం కొత్త వజ్రకూటం దొడ్ల డెయిరీ వద్ద బెంగాల్ టైగర్ సంచారం చేసినట్లు తెలుస్తోంది. వజ్రకూటం నుంచి కత్తిపూడి వైపు వెళ్తున్న ఆటో డ్రైవర్ కి పెద్దపులి కనిపించింది. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అటవీశాఖ సిబ్బంది పులి పాదముద్రలను సేకరించే పనిలో పడ్డారు. రాత్రి వేళల్లో ఎవరూ బయటకు రావద్దని అటవీశాఖ సిబ్బంది హెచ్చరిస్తోంది.

Jyothi

Jyothi

Next Story