సీఎం ప్రకటనతో సగం చచ్చాం.. ఈయన వ్యాఖ్యలతో క్షోభకు గురవుతున్నాం

సీఎం ప్రకటనతో సగం చచ్చాం.. ఈయన వ్యాఖ్యలతో క్షోభకు గురవుతున్నాం
x
రాజధాని రైతులు
Highlights

మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలపై రాజధాని రైతులు భగ్గుమన్నారు. రాజధాని ప్రాంత రైతులకు వారి భూములను వెనక్కి ఇచ్చేస్తామని పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల...

మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలపై రాజధాని రైతులు భగ్గుమన్నారు. రాజధాని ప్రాంత రైతులకు వారి భూములను వెనక్కి ఇచ్చేస్తామని పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల వారు ఆవేదన వ్యక్తం చేశారు. భూములను వెనక్కి ఇస్తామనే విషయం వైసీపీ మేనిఫెస్టోలో లేదని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ ప్రకటనతో సగం చచ్చిపోయామని పెద్దిరెడ్డి సహా ఇతర మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలతో తీవ్ర క్షోభను అనుభవిస్తున్నామని అన్నారు. అమరావతిలో నిరసన వ్యక్తం చేస్తున్నవారంతా టీడీపీవారే అంటూ పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా రైతులు తప్పుబట్టారు. అమరావతిలో ఏ పార్టీ జెండా లేదని అన్నారు. ఉన్నవన్నీ నల్ల జెండాలేనని చెప్పారు. రైతులతో రాజకీయం చేయవద్దని మండిపడ్డారు.

రాజధాని రైతులు వరుసగా మూడో రోజు రోడ్డెక్కారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ తుళ్లూరులో వంటవార్పు చేపట్టారు. రోడ్డుపైనే వంట చేస్తుండటంతో సచివాలయానికి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టొద్దని, మంత్రులు అవగాహనతో మాట్లాడాలని రైతులు చెబుతున్నారు. రాజధానిలో ఇప్పటివరకు నిర్మించిన రోడ్లు, భవనాలను ఏం చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. తమ త్యాగాలను అవమానించవద్దంటూ నినాదాలు చేస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories