వింత వ్యాధితో ముగ్గురు యువకులు మృతి

వింత వ్యాధితో ముగ్గురు యువకులు మృతి
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

వింత వ్యాధి సోకి గడచిన మూడు వారాలలో ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు మృతి చెందిన సంఘటన మండలంలోని అన్నవరం పంచాయతీలో చోటుచేసుకుంది.

చింతపల్లి: వింత వ్యాధి సోకి గడచిన మూడు వారాలలో ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు మృతి చెందిన సంఘటన మండలంలోని అన్నవరం పంచాయతీ పనసలపాడు గ్రామంలో చోటుచేసుకుందని అన్నవరం తాజా మాజీ సర్పంచ్ సుండ్రు నాగజ్యోతి , వైకాపా నాయకుడు యస్. చిన్నబ్బాయిలు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ గ్రామంలో చోటు చేసుకున్న మృతులు ముగ్గురు కొర్రా సుబ్బారావు(30), మర్రి నాగేశ్వరరావు(27), మర్రి సొనియా(26) లంతా ఆయా కుటుంబాలకు చేతికంది వచ్చిన వారేనన్నారు.

ఇద గ్రామానికి చెందిన మరో ఆరుగురు అంతుబట్టని వ్యాధితో గ్రామంలోనే అల్లాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి మన్యంలో అడపాదడపా వైధ్య శిబిరాలు నిర్వహించవలసిన అవసరం ఎంతైనా ఉందని తక్షణమే సంబంధించి వైధ్య శాఖ ఉన్నతాధికారులు స్పందించి అన్నవరం పంచాయతీ పనసలపాడు గ్రామంలో వైధ్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.Show Full Article
Print Article
More On
Next Story
More Stories