Penukonda: ఒకే ఇంట్లో కుళ్లిపోయిన స్థితిలో ముగ్గురి మృతదేహాలు

Penukonda: అనంతపురం జిల్లా పెనుగొండలో ఒకే ఇంట్లో ముగ్గురి మృతదేహాలు కనిపించడం కలకలం రేపింది.

Arun Chilukuri
Published on: 25 May 2021 2:44 PM IST
Three Family Members commits suicide in Penukonda of Anantapur
X

ఒకే ఇంట్లో కుళ్లిపోయిన స్థితిలో ముగ్గురి మృతదేహాలు(రెప్రెసెంటేషనల్  ఇమేజ్ )

Penukonda: అనంతపురం జిల్లా పెనుగొండలో ఒకే ఇంట్లో ముగ్గురి మృతదేహాలు కనిపించడం కలకలం రేపింది. వేణుగోపాల స్వామి ఆలయం సమీపంలో ఓ ఇంట్లో నుంచి దుర్వాసన రాగా స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఇంట్లోకి వెళ్లి చూడగా కుళ్లిపోయిన మృతదేహాలు కనిపించాయి. ఆర్థిక కష్టాలతో వీరంతా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుండగా పోలీసులు కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఘటనపై పెనుకొండ పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు. అయితే వారు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారో అనే విషయం ఇంకా తెలియరాలేదు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story