వైసీపీ జెండా రాడ్ కు విద్యుత్ షాక్... ముగ్గురు విద్యార్థులు మృతి

వైసీపీ జెండా రాడ్ కు విద్యుత్ షాక్... ముగ్గురు విద్యార్థులు మృతి
x
Highlights

ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కొప్పర గ్రామంలో విషాదం నెలకొంది. విద్యుత్ షాక్‌తో ముగ్గురు విద్యార్థులు మృత్యువాతపడ్డారు. కోదండరామస్వామి వారి ఆలయ...

ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కొప్పర గ్రామంలో విషాదం నెలకొంది. విద్యుత్ షాక్‌తో ముగ్గురు విద్యార్థులు మృత్యువాతపడ్డారు. కోదండరామస్వామి వారి ఆలయ ప్రధాన కూడలిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కూడలిలో ఉన్న వైసీపీ జెండా రాడ్‌ను పట్టుకోగా.. విద్యుత్‌ షాక్‌ తగలడంతో.. ముగ్గురు విద్యార్థులు షేక్ పఠాన్‌ గౌస్, షేక్‌ హసన్‌ బుడే, పఠాన్‌ అమర్‌ చనిపోయారు. చనిపోయిన ముగ్గురు విద్యార్థుల వయస్సు 11 ఏళ్లు. ఉదయం ముగ్గురు కలిసి కూడలి దగ్గర ఆడుకుంటుండగా.. ఈ ప్రమాదం జరిగింది. ఒకరి తర్వాత ఒకరు జెండా రాడ్‌ను పట్టుకోవడంతో.. ముగ్గురు విద్యార్థులకు షాక్‌ తగిలింది. దీంతో ప్రాణాలు పోవడంతో పాుట.. మృతదేహాలు మొత్తం మాడిపోయాయి. ఇటు సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories