Atchannaidu: ఈసారి టీడీపీకి 175 స్థానాలు రావడం ఖాయం

Kinjarapu Atchannaidu: సంబంధం లేకున్నా ఫైబర్ నెట్, IRR కేసుల్లో ఇరికించే యత్నం

Shekhar G
Published on: 7 Oct 2023 4:06 PM IST
This Time TDP Is Sure To Get 175 Seats Says Kinjarapu Atchannaidu
X

Atchannaidu: ఈసారి టీడీపీకి 175 స్థానాలు రావడం ఖాయం

Kinjarapu Atchannaidu: కేసులు, కోర్టులు, వాదనలు, వాయిదాలు, ధర్నాలతో ఏపీ రాజకీయం అట్టుడికిపోతుంది. ఇప్పటికే స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్ కాగా.. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో.. అవినీతి జరిగిందని వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ విషయంలో సీఐడీ విచారణ కూడా జరుపుతోంది. ఐతే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో వాస్తవాలు పేరుతో టీడీపీ పుస్తకం రూపొందించింది. ఈ పుస్తకాన్ని టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు విడుదల చేశారు. ఆధారాల్లేకుండా స్కిల్ కేసు వేశారు. ఇప్పుడు సంబంధం లేకున్నా ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ అంశాల్లోనూ కేసులు పెట్టారని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను నిలదీస్తున్నందుకే చంద్రబాబును జ్యూడీషియల్ కస్టడీలో పెట్టారని ఆయన ఆరోపించారు. జగన్ చేసిన తప్పులతో ఈసారి టీడీపీకి 175 స్థానాలు రావడం ఖాయమన్నారు అచ్చెన్న.

Shekhar G

Shekhar G

Next Story