logo
ఆంధ్రప్రదేశ్

భక్తులు లేని బ్రహ్మోత్సవం

భక్తులు లేని బ్రహ్మోత్సవం
X
Highlights

కలియుగ వరదుడు శ్రీ వేంకటేశుని వార్షిక బ్రహ్మోత్సవ సంరంభం. తిరుగిరుల్లోని ప్రతి హృదయానికీ మోదాన్ని ...

కలియుగ వరదుడు శ్రీ వేంకటేశుని వార్షిక బ్రహ్మోత్సవ సంరంభం. తిరుగిరుల్లోని ప్రతి హృదయానికీ మోదాన్ని పంచే సందర్భం. స్మరణ మాత్రాన సమస్త శుభాలనూ చేకూర్చే ఏడుకొండలవాడు భక్తజనులకు కొంగు బంగారం. కలియుగ వరదుడిని బ్రహ్మోత్సవాల శుభవేళ.. దర్శించి, ఆ స్వామి అనంతమైన కరుణను పొందాలని ప్రతీ భక్తుడు ఉవ్విళ్లూరుతుంటారు. అందుకే బ్రహ్మోత్సవాలు అనగానే భక్తజనం తిరుక్షేత్రానికి పోటెత్తుతోంది. కానీ కరోనా అనే ఒకానొక మహమ్మారి కారణంగా తిరుమాఢ వీధుల్లో విహరించే పద్మావతివిభుడు ఈసారి ఆలయ ప్రాకారానికే పరిమితం కానున్నాడు. తూర్పు, పడమర, ఉత్తర, దక్షణ వీధుల్లో నాలుగు వైపులా భక్తులను అలరించే శ్రీనివాసుడు తనకు తానే బ్రహ్మోత్సవాలను జరిపించుకుంటున్నాడు. కరోనా నిబంధనల మధ్య కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యక్ష ప్రసారం ద్వారా యావత్‌ భక్తజనానికి కనువిందు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈనెల 19వ తేదీ నుంచి పది రోజుల పాటు శ్రీనివాసుని భక్తులకు అనుదినమూ పండుగే అనుక్షణమూ అంబరాన్నంటే సంబరమే..!

కలిదోష నివారకుడు భక్తుల కొంగుబంగారం తిరుమల వేలుపు శ్రీ శ్రీనివాసుడు. ఏడుకొండలరేని, వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తులకు నయన మనోహరం హృదయోల్లాస విశేషం. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే లక్ష్మీదేవిని అన్వేషిస్తూ వచ్చి భువిపై స్వయంభువుగా వెలిసిన పుణ్యతీర్థం తిరుమల. యావత్ హైందవ భక్తలోకం ఎదురు చూస్తున్న తిరుమల బ్రహ్మోత్సవాలు కోవిడ్‌ నిబంధనల మధ్య ఎలా ఆలయం లోపలే జరగనున్నాయి.

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..Web TitleThis time no devotees at Tirumala Brahmotsavams
Next Story