AP News: ఏపీలో రెండోసారి కేంద్ర బృందం పర్యటన

AP News: వరదలపై నష్టం అంచనా వేయనున్న బృందం

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 11 Sept 2024 10:01 PM IST
This is the second visit of the central team to AP
X

AP News: ఏపీలో రెండోసారి కేంద్ర బృందం పర్యటన

AP News: భారీ వర్షాలకు ఏపీలోని పలు జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో వచ్చిన వరద వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి ఆరుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం పర్యటిస్తోంది. బుధవారం తాడేపల్లిలోని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో అధికారులతో భేటీ అయింది.

జరిగిన నష్టంపై వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో కేంద్రబృందం సమావేశమైంది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా వరద నష్టంపై తీవ్రతను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. వరద ప్రభావిత ప్రాంతాల వీడియోలను, ఫొటోలను కేంద్ర బృందానికి వివరించారు. దాదాపు 6,882 కోట్ల నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా వేసినట్లు కేంద్ర బృందానికి వివరించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story