TTD: ఆర్బీఐ తీరుపై మండిపడుతున్న తిరుమల భక్తులు

Thirumala Devotees On Fire Over RBI Trend
x

తిరుమల తిరుపతి దేవస్థానం (ఫోటో ది హన్స్ ఇండియా )

Highlights

TTD: టీటీడీ సంస్థ కాదు ఓ వ్యక్తి అని నిర్ధారించడంపై మండిపాటు *నోట్ల రద్దు తర్వాత తిరుమల హుండీలో రూ.52కోట్ల పాత నోట్లు

TTD: దేశంలో పాత నోట్లు రద్దు అయ్యి 5 ఏళ్లు గడుస్తుంది. టీటీడీ వద్ద పాత నోట్ల కట్టలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. దాదపు 51 కోట్ల రూపాయల పాత నోట్లు ఉన్నాయి. వాటిని మార్చుకోలేక టీటీడీ నానా తంటాలు పడుతోంది. కేంద్రాన్ని టీటీడీ పదేపదే వేడుకుంటున్నా విచిత్రమైన సమాధానాలు చెబుతూ కాలం వెల్లదీస్తోంది. ఆర్‌టీఐ ద్వారా అడిగినా ప్రశ్నకు టీటీడీ సంస్థ కాదని ఒక వ్యక్తిగా ఆర్బీఐ భావించడం ఇప్పుడు వివాదంగా మారుతోంది.

పాతనోట్ల వ్యవహారంపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. అయినా కేంద్రం పాత నోట్లను మార్చి ఇచ్చేందుకు సుముఖత చూపించడం లేదని తెలుస్తోంది. అయితే టీటీడీ వద్ద ఉన్న పాతనోట్లను తీసుకుంటే ఇతర సంస్థలు, దేవాల‌యాల ట్రస్ట్‌లు కూడా ఒత్తిళ్లు చేసే అవకాశముందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెబుతున్నారు. దీంతో పాత‌నోట్ల విష‌యంలో ఏంచేయాలో అర్థం కావ‌డంలేద‌ని టీటీడీ ఛైర్మన్ అంటున్నారు. భ‌క్తులు ప‌విత్రంగా స‌మ‌ర్పించిన కానుక‌ల విష‌యంలో ముందుకు పోలేక‌పోతున్నామ‌న్నారు.హిందువుల మనోభావాలు దెబ్బతినేల ఆర్బీఐ వ్యవహరిస్తోందని భక్తులు ఆరోపిస్తున్నారు. శ్రీవారికి హుండీ ద్వారా వేసిన పాత నోట్లను ఆర్బీఐ వెంటనే తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. టీటీడీని ఆర్బీఐ ఓ వ్యక్తిగా అభివర్ణించడం విడ్డురమన్నారు. సాక్ష్యాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడిని హేళన చేయడమేనని భక్తులు ఆరోపిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories