YS Jagan: కల్తీ నెయ్యి అంటూ కట్టుకథ తెరపైకి తెస్తున్నారు

YS Jagan: చంద్రబాబు దేవుళ్లను రాజకీయాలకు వాడుకుంటున్నారు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 20 Sept 2024 4:43 PM IST
They are bringing the fake story of adulterated ghee to the screen Says YS Jagan
X

YS Jagan: కల్తీ నెయ్యి అంటూ కట్టుకథ తెరపైకి తెస్తున్నారు

YS Jagan: తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు చంద్రబాబు కల్తీ నెయ్యి అంటూ కట్టుకథను తెరపైకి తీసుకు వచ్చారని మాజీ సీఎం జగన్ విమర్శించారు. తిరుమల లడ్డూ కల్తీపై వస్తున్న దుష్ప్రచారాన్ని జగన్ తిప్పికొట్టారు. దేవుళ్లను కూడా చంద్రబాబు రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. భక్తుల మనోభావాలను అడ్డుకోవడం ధర్మమేనా అని ప్రశ్నించారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టుకు, ప్రధాని దృష్టికి తీసుకు వెళ్తానని జగన్ చెప్పారు.

నియమ నిబంధనలు.. మూడు సార్లు టెస్టింగ్ ల తర్వాత వచ్చే రిపోర్టు అనంతరం నెయ్యి లడ్డూ తయారికి వెళ్తుందని జగన్ తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చామన్నారు. బోర్డు తీసుకున్న నిర్ణయాల్లో ప్రభుత్వ ప్రమేయం ఉండదని జగన్ చెప్పారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story