Kodali Nani: అందుకే పవన్ ప్రాయశ్చిత దీక్ష చేస్తున్నారు

Kodali Nani: తిరుపతి లడ్డూ ప్రసాదంలో ఎలాంటి తప్పు జరగలేదు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 25 Sept 2024 5:31 PM IST
There is nothing wrong with Tirupati Laddu Prasad Says Kodali Nani
X

Kodali Nani: అందుకే పవన్ ప్రాయశ్చిత దీక్ష చేస్తున్నారు

Kodali Nani: తిరుపతి లడ్డూ ప్రసాదంలో ఎలాంటి తప్పు జరగలేదని ప్రజలకు ఒకటికి పది సార్లు చెబుతున్నామన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. ప్రసాదం కల్తీ అయ్యిందని గతంలో ఏ ఒక్క భక్తుడూ ఫిర్యాదు చేయలేదన్నారు. తిరుపతిలో వాడే ప్రతి వస్తువునూ టెస్టు చేశాకే లోపలికి అనుమతిస్తారన్నారు. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని ఏ ల్యాబ్‌ కూడా స్పష్టంగా చెప్పలేదని.. జరిగి ఉండొచ్చని మాత్రమే చెప్పాయన్నారు. దేవున్ని అడ్డం పెట్టుకుని... రాజకీయాలు చేస్తున్నారని కొడాలి నాని ఫైర్ అయ్యారు.

ఈనెల 28న రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో పూజలు చేస్తామని వెల్లడించారు. ఇచ్చిన హామీల నుంచి తప్పించుకోవడానికే.. తిరుమల ప్రసాదంపై చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని పేర్ని నాని ఫైర్ అయ్యారు. తప్పు చేస్తున్నామని వారి ఆంతరాత్మ దహించుకుపోతుంది కాబట్టే.. పవన్ ప్రాయశ్చిత దీక్ష చేస్తున్నారని విమర్శించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story