CM Jagan: లా నేస్తం వంటి పథకం దేశంలో ఎక్కడా లేదు

CM Jagan: 2,677 మంది జూనియర్ అడ్వకేట్స్‌ ఖాతాల్లో రూ.6.12 కోట్లు జమ

Shekhar G
Published on: 26 Jun 2023 7:15 PM IST
There Is No Scheme Like YSR Law Nestham Anywhere In The Country
X

CM Jagan: లా నేస్తం వంటి పథకం దేశంలో ఎక్కడా లేదు

CM Jagan: లా నేస్తం వంటి పథకం దేశంలో ఎక్కడా లేదని సీఎం జగన్ అన్నారు. వైఎస్సార్‌ లా నేస్తం పథకం నిధులను ఏపీ సీఎం జగన్ విడుదల చేశారు. 2,677 మంది జూనియర్ అడ్వకేట్స్‌కు 6కోట్ల 12 లక్షలను వారి ఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు. నాలుగు సంవత్సరాలుగా వైఎస్సార్ లా నేస్తం అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటి దాకా 5వేల781 మందికి మేలు చేశామని, మొత్తంగా 41కోట్ల 52 లక్షలు జూనియర్‌ లాయర్లకు ఇచ్చామని చెప్పారు. లా కోర్సు పూర్తి చేసిన వారు ప్రాక్టీసు పరంగా నిలదొక్కుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వారికి తోడుగా నిలిచేందుకు వైఎస్సార్ లా నేస్తం తీసుకొచ్చామని చెప్పారు. జూనియర్ లాయర్లకు ప్రతి నెలా 5 వేల చొప్పున ఏడాదిలో 60 వేలు ఇస్తున్నామని చెప్పారు. మూడేళ్లలో ఇలా ఒక్కొక్కరికీ రూ.1లక్ష 8 వేలు ఇస్తున్నామని తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story