బిచ్చగాళ్ల ముసుగులో తిరుపతిలో దొంగతనాలు!

బిచ్చగాళ్ల ముసుగులో తిరుపతిలో దొంగతనాలు!
x
Highlights

దానం చేయాలంటూ ఏకంగా దుకాణంలోకి వెళ్లారు. అలా లోపలోకి వెళ్లి యజమాని కాళ్ళవెళ్ళ పడి డబ్బులు ఆడుకున్నారు.. ఈ క్రమంలో సదరు మహిళలతో వచ్చిన పిల్లలు తమ చేతివాటం చూపించారు.

సమాజంలో దొంగతనాలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. దొంగలు కూడా రోజురోజుకు ఇంప్రూవ్ అయిపోతున్నారు.. స్మార్ట్ గా ఇట్టే దొంగతనాలు చేసేస్తున్నారు. తాజాగా తిరుపతి నగరంలో బిచ్చగాళ్ల ముసుగులో వచ్చి దొంగతం చేస్తున్న కుటుంబం సీసీ కెమరాకి చిక్కింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. తిరుమలలోని లీలా మహల్‌ సెంటర్‌ కూడలిలోని లక్ష్మీవెంకటేశ్వర స్టీల్‌ దుకాణంలోకి ఇద్దరు మహిళలు ముగ్గురు పిల్లలను తమ వెంట తెచ్చుకున్నారు.

దానం చేయాలంటూ ఏకంగా దుకాణంలోకి వెళ్లారు. అలా లోపలోకి వెళ్లి యజమాని కాళ్ళవెళ్ళ పడి డబ్బులు ఆడుకున్నారు.. ఈ క్రమంలో సదరు మహిళలతో వచ్చిన పిల్లలు తమ చేతివాటం చూపించారు. మహిళలు దానం కోసం యజమానిని బ్రతిమలుకుంటున్న సమయంలో చిన్నపిల్లలు టేబుల్ కిందికి వెళ్లి డ్రాలో ఉన్న డబ్బులను చాలా ఈజీగా దొంగతనం చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. అయితే వీటిని క్షుణ్ణంగా పరిశీలించినట్టు అయితే ఇదంతా పక్కా ప్రణాళికతోనే చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. దీనిపైన కేసు నమోదు చేసుకున్న అలిపిరి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories