శ్రీకాకుళం జిల్లా రాజాంలో థియేటర్‌ సీజ్.. రాధేశ్యామ్‌ ను ఆపేసి...

Srikakulam - Theatre Seize: ఆందోళనకు దిగిన అభిమానులు...

Shireesha
Published on: 11 March 2022 11:19 AM IST
Theatre Seized in Srikakulam Razam Because of Radhe Shyam Benefit Show | AP Breaking News
X

శ్రీకాకుళం జిల్లా రాజాంలో థియేటర్‌ సీజ్.. రాధేశ్యామ్‌ ను ఆపేసి...

Srikakulam - Theatre Seize: రాధేశ్యామ్‌ సినిమా బెనిఫిట్‌ షో వేసిన థియేటర్‌ను ఏపీ రెవెన్యూ అధికారులు సీజ్‌ చేశారు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలో జరిగింది. ఇవాళ హీరో ప్రభాస్‌ నటించిన రాధేశ్యామ్‌ చిత్రం విడుదలయింది. ఈ నేపథ్యంలో బెనిఫిట్‌ షోలు ప్రదర్శించరాదంటూ ఏపీ ప్రభుత్వం అదేశాలు జారీ చేసింది.

అయినా రాజాంలోని ఎస్‌వీసీ థియేటర్‌ యాజమాన్యం బెనిఫిట్‌ షోను ప్రదర్శించింది. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకున్నారు. దీంతో థియేటర్ యాజమాన్యం షోను ఆపేసింది. దీంతో అభిమానులు ఆందోళనకు దిగారు. థియేటర్‌ను ఏపీ రెవెన్యూ అధికారులు సీజ్‌ చేశారు. థియేటర్‌ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు.

Shireesha

Shireesha

Next Story