Botsa Jhansi: విశాఖ ఎంపీ బరిలో బొత్స ఝాన్సీ..!

Botsa Jhansi: బొత్స ఝాన్సీ పేరును పరిశీలిస్తున్న వైసీపీ హైకమాండ్

Jyothi
Published on: 7 Jan 2024 12:30 PM IST
The YCP High Command is Considering Botsa Jhansi Name as Visakha MP
X

Botsa Jhansi: విశాఖ ఎంపీ బరిలో బొత్స ఝాన్సీ..!

Botsa Jhansi: విశాఖ ఎంపీగా బొత్స ఝాన్సీ పేరును వైసీపీ హైకమాండ్ పరిశీలిస్తోంది. కాపు సామాజిక వర్గం కావడం.. సానుకూల అంశంగా కనిపిస్తోంది. గతంలో రెండుసార్లు ఎంపీగానూ, రెండు పర్యాయాలు జడ్పీ ఛైర్‌పర్సన్‌గానూ ఝాన్సీ పనిచేశారు. అందుకు తోడు ఉత్తరాంధ్ర కాపు సామాజిక వర్గం కావడం.. ఝాన్సీ పోటీ ప్రభావం ఉత్తరాంధ్ర అంతటా ఉంటుందనే హైకమాండ్ ఆలోచిస్తుంది.

బీసీలకు గతంలో లేని రాజకీయ అధికారాన్ని కల్పించే ప్రయత్నం చేస్తోంది వైసీపీ. ఇందులో భాగంగానే స్థానికంగా ఉండే బీసీ నేతలను ఎన్నుకుంటోంది. ఉత్తరాంధ్రలో కీలకంగా ఉండే తూర్పుకాపు సామాజిక వర్గానికి చెందిన బొత్స ఝాన్సీ.. ఉత్తరాంధ్రను ఇన్‌ఫ్యూయెన్స్‌ చేసే అవకాశం ఉందని వైసీపీ భావిస్తోంది.

Jyothi

Jyothi

Next Story