ఏపీలో తుది దశకు చేరిన సినిమా టికెట్ల అంశం

Movie Tickets: ఇవాళ సీఎం జగన్‌తో టాలీవుడ్ ప్రముఖుల భేటీ,సినిమా టికెట్ల ధర, ఇండస్ట్రీ సమస్యలపై చర్చించే ఛాన్స్.

Sriveni Erugu
Published on: 10 Feb 2022 11:37 AM IST
The topic of movie tickets reaching the final stage in AP
X

ఏపీలో తుది దశకు చేరిన సినిమా టికెట్ల అంశం

Movie Tickets: ఏపీలో సినిమా టికెట్ల రేట్ల పెంపు వ్యవహారం నేడు కొలిక్కిరానున్నట్లు తెలుస్తోంది. సినిమా టికెట్ల ధరల పెంచాలని కోరుతోన్న సినీ ప్రముఖులు ఇవాళ సీఎం జగన్‌ను కలవనున్నారు. దీనిపై జగన్ తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఉదయం 11 గంటలకు సినీ ప్రముఖులు జగన్‌ను కలవనున్నారు. కాసేపట్లో హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం బయలుదేరనున్నారు. చిరంజీవి, నాగార్జున, ప్రభాస్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, డైరక్టర్ రాజమౌళి, కొరటాల శివ సహా పలువురు దర్శక, నిర్మాతలు సమావేశానికి హాజరవుతారు. కోవిడ్‌తో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోన్న సినీ పరిశ్రమను ఆదుకోవాలని కోరనున్నారు.

సినిమా టికెట్ల ధరల పెంపుపై ప్రభుత్వం నియమించిన కమిటీ ఇప్పటికే నివేదికను సిద్దం చేసింది. సినిమా టికెట్ల ధరలను పెంచాలని ప్రాథమికంగా కమిటీ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. కమిటీ ప్రతిపాదనలపై సినీ ప్రముఖులతో సీఎం చర్చిస్తారు. ఎంత మేర టికెట్లు పెంచాలనే అంశంపై అభిప్రాయాలు తీసుకుని తుది నిర్ణయం తీసుకోనున్నారు. సినిమా నిర్మాణ వ్యయం భారీగా పెరిగినందున అందుకు అనుగుణంగా టికెట్ల ధరలు పెంచాలని ఇటీవలి కాలంలో సినీ హీరోలు, దర్శక, నిర్మాతలు కోరుతున్నారు. హైకోర్టు ఆదేశాలతో ఇప్పటికే తెలంగాణలో టికెట్టు ధరలు పెరిగాయని, అత్యధిక థియేటర్లు ఉన్న ఏపీలో సినిమా టికెట్ల ధరలు పెంచకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నట్లు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story