కాంగ్రెస్‌లో YSRTP విలీనానికి ముహూర్తం ఫిక్స్

YS Sharmila: రేపు కాంగ్రెస్‌లో చేరనున్న షర్మిల

Jyothi
Published on: 3 Jan 2024 7:28 AM IST
The Time Fixed for YSRTP Merger with Congress
X

కాంగ్రెస్‌లో YSRTP విలీనానికి ముహూర్తం ఫిక్స్

YS Sharmila: కాంగ్రెస్‌లో YSRTP విలీనానికి ముహూర్తం ఖరారయ్యింది. రేపు షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయనున్నట్లు తెలుస్తోంది. ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో విలీన కార్యక్రమం ఉండనున్నట్లు సమాచారం. ఇదే అంశాన్ని ఏఐసీసీ, షర్మిల సన్నిహిత వర్గాలు ధృవీకరించాయి. కాంగ్రెస్‌లో షర్మిల పార్టీ విలీనం... పార్టీలో షర్మిల బాధ్యతలపై ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయి. షర్మిల పార్టీలోకి వస్తే ఎలా ఉంటుందని... ఇటీవల ఏపీ నేతలను ఖర్గే, రాహుల్ అడిగినట్లు తెలుస్తోంది. షర్మిల పార్టీలోకి వస్తున్నట్లు ఖర్గే, రాహుల్ చెప్పారన్నారు గిడుగు రుద్రరాజు. షర్మిల ద్వారా ఏపీలో పార్టీకి పునరుత్తేజం వస్తుందనే అంచనాలో అధిష్టాన ముఖ్యులు ఉన్నారన్నారు.

Jyothi

Jyothi

Next Story