Dharmana Prasadarao: మత్స్యకారులను హీనంగా చూసిన టీడీపీ సర్కార్

The TDP Government Looked Down On The Fishermen Says Dharmana Prasadarao
x

Dharmana Prasadarao: మత్స్యకారులను హీనంగా చూసిన టీడీపీ సర్కార్

Highlights

Dharmana Prasadarao: మత్స్యకారులకు ఉపాధి చూపేందుకే ఫిష్ ఆంధ్రా స్టాళ్ల ఏర్పాటు

Dharmana Prasadarao: గతంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం మ‌త్స్యకారుల‌ను హీనంగా చూశాయని, శాంతియుతంగా నిరసన తెలిపితే టెంట్లను తగల బెట్టించాయని, తమ సమస్యలు విన్నవించడానికి మత్స్యకారులు అప్పటి సీఎం చంద్రబాబు దగ్గరికి వెళితే తోక కత్తిరిస్తానని హెచ్చరించారని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. కానీ తాము మాత్రం మత్స్యకారులకు ఉపాధి చూపేందుకే ఫిష్ ఆంధ్రా స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నామ‌ని మంత్రి వెల్లడించారు. శ్రీకాకుళం నగరానికి దగ్గరలోని పొన్నాడ‌ రూట్‌లో ఫిష్ ఆంధ్రా స్టాల్‌ను ధర్మాన ప్రారంభించారు. చేప పిల్లల ర‌వాణాకు 13 లక్షల 39 వేల రూపాయ‌లతో వాహ‌నం కొనుగోలు చేశారని, వేటకు వెళ్లి చనిపోయిన వారికి 10 లక్షల రూపాయ‌ల నష్టప‌రిహారం ఇస్తున్నామని చెప్పారు.. అర్హుల‌యిన వారికి డీజిల్‌పై సబ్సిడీ ఇస్తున్నామని చెప్పారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.

Show Full Article
Print Article
Next Story
More Stories