మాజీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్‌కు రంగం సిద్ధం

జూన్‌ 6 వరకు అరెస్ట్ చేయొద్దని కోర్టు ఆదేశాలు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 6 Jun 2024 12:35 PM IST
The Stage is Set for the Arrest of Former Ex MLA Pinnelli Ramakrishna Reddy
X

మాజీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్‌కు రంగం సిద్ధం

మాజీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది. ఈవీఎం ధ్వంసం కేసుతో పాటు హత్యాయత్నం కేసుల్లో ఆయన్ను పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకునే అవకాశాలున్నాయి. ఈవీఎం ధ్వంసం కేసు నమోదు చేయడంతో మాచర్ల నుంచి పరారైన పిన్నెళ్లి.. నరసారావుపేటలోని అనిల్‌కుమార్‌ యాదవ్‌ నివాసంలో ఉన్నారు. ఆ కేసులో తనను అరెస్ట్ చేయకుండా కోర్టును ఆశ్రయించడంతో.. కోర్టు జూన్‌ 6 వరకు అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు వచ్చాయి. ఇవాళ్టితో ఆ గడువు ముగుస్తోంది. దాంతో పిన్నెళ్లిని అరెస్ట్‌ చేసేందుకు సిద్ధమయ్యారు పోలీసులు. పిన్నెళ్లి మరోసారి తప్పించుకోకుండా..అనిల్ కుమార్ ఇంటిదగ్గర నిఘా ఉంచారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story