Srikakulam: శ్రీకాకుళంలో దొంగతనానికి పాల్పడ్డ ముఠా అరెస్ట్

Srikakulam: వృద్దురాలిని తాళ్లతో కట్టి బంగారం చోరీ చేసిన దుండగులు

Shashank Gullapelli
Published on: 31 March 2024 4:08 PM IST
The Srikakulam Theft Gang Has Been Arrested By The Police
X

Srikakulam: శ్రీకాకుళంలో దొంగతనానికి పాల్పడ్డ ముఠా అరెస్ట్

Srikakulam: శ్రీకాకుళంలోని ఓ వృద్ద మహిళను తాళ్లతో కట్టి ఇంట్లోని బంగారం దోచుకొని వెళ్లిన ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా కేంద్రంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్న జగదాంబ అనే వృద్దురాలి ఇంట్లో చొరబడిన దొంగలు ఆమెను తాళ్లతో కట్టి ఇంట్లో ఉన్న బంగారాన్ని దోచుకువెళ్లారు. నిందితులు ఖమ్మం జిల్లా భద్రచలం చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి వారి వద్ద నుంచి 25 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శృతి తెలిపారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story