AP Congress: ఏపీ కాంగ్రెస్‌ అభ్యర్థుల సెకండ్ లిస్ట్ రిలీజ్

The Second List Of AP Congress Candidates Has Been Released
x

 AP Congress: ఏపీ కాంగ్రెస్‌ అభ్యర్థుల సెకండ్ లిస్ట్ రిలీజ్

Highlights

AP Congress: 12 అసెంబ్లీ, 6 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన

AP Congress: సార్వత్రిక ఎన్నికల కోసం...ఏపీ లోక్‌‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల రెండో జాబితాను కాంగ్రెస్ రిలీజ్ చేసింది. తాజాగా విడుదల చేసిన లిస్ట్‌లో.. 6 లోక్‌సభ, 12 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది ఆ పార్టీ హైకమాండ్. తిరుపతి ఎంపీ అభ్యర్థిగా చింతా మోహన్, నరసరావుపేట నుంచి సుధాకర్‌, నెల్లూరు- కొప్పుల రాజు, అనకాపల్లి - వేగి వెంకటేష్‌, విశాఖ- సత్యనారాయణ రెడ్డి, ఏలూరు నుంచి కావూరి బరిలోకి దిగనున్నారు. ఇక ఇటీవలే వైసీపీ రాజీనామా చేసిన కిల్లి కృపారాణి టెక్కలి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఫస్ట్ లిస్ట్‌లో 114 అసెంబ్లీ, 5 పార్లమెంట్‌ స్థానాలను ప్రకటించిన నేపథ్యంలో.. ఇప్పటి వరకు 11 లోక్‌సభ, 126 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories