Pawan Kalyan: జనసేన పాత్రపై రేపటి సమావేశంలో చర్చ జరగవచ్చు

Pawan Kalyan: ఎన్డీఏ పాలసీలను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే దానిపై చర్చ జరగవచ్చు

Shekhar G
Published on: 17 July 2023 7:09 PM IST
The Role Of Janasena Can Be Discussed In Tomorrow Meeting
X

Pawan Kalyan: జనసేన పాత్రపై రేపటి సమావేశంలో చర్చ జరగవచ్చు

Pawan Kalyan: తెలుగు రాష్ట్రాల భవిష్యత్, పార్టీల మధ్య ఐక్యత, జనసేన పాత్రపై రేపటి ఎన్డీఎ సమావేశంలో చర్చ జరగవచ్చని అభిప్రాయపడ్డారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్. తిరుపతి పర్యటన ముగించుకొని ఢిల్లీకి చేరుకున్నారు జనసేనాని. రేపు జరగబోయే ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశంలో పవన్‌ పాల్గొననున్నారు. ఎన్డీఏ పాలసీలు ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే దానిపై రేపటి సమావేశంలో చర్చ జరగవచ్చని ఆయన అన్నారు. అలాగే.. ఏపీలో ఎన్నికలపై కూడా ఈ సమావేశంలో ప్రస్తావించే అవకాశం ఉందన్నారు. పవన్ తో పాటు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఢిల్లీకి చేరుకున్నారు.

Shekhar G

Shekhar G

Next Story