Nithin Gadkari: దేశాభివృద్ధిలో ఏపీ పాత్ర కీలకం

Nithin Gadkari: ఏపీలో రోడ్ల అభివృద్ధికి 3 లక్షల కోట్లు.

Sriveni Erugu
Published on: 18 Feb 2022 8:20 AM IST
The Role of AP is Crucial in The Development of The Country
X

 Nithin Gadkari: దేశాభివృద్ధిలో ఏపీ పాత్ర కీలకం 

Nithin Gadkari: దేశాభివృద్ధిలో ఏపీ పాత్ర కీలకమని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కొనియాడారు. ఏపీలో రోడ్ల అభివృద్ధికి 3 లక్షల కోట్లు ఇస్తామన్నారు. 22 గ్రీన్ ఎక్స్‌ప్రెస్‌ హైవేలు ప్లాన్ చేస్తున్నామని, అందులో 6 ఏపీకే కేటాయించాన్నారు నితిన్‌ గడ్కరీ. అలాగే విశాఖ నుంచి రాయపూర్ 16,102 కోట్ల విలువైన రోడ్ నిర్మిస్తామని తెలిపారు. ఈ ఎక్స్‌ప్రెస్‌ హైవే 2024 లోపే పూర్తిచేస్తామన్నారు కేంద్ర మంత్రి. నాగ్‌పూర్-విజయవాడ ఎక్స్‌ప్రెస్ హైవేను 2025 నాటికి పూర్తిచేస్తామని, హైదరాబాద్-విశాఖ ప్రాజెక్ట్‌ 2025 నాటికి పూర్తవుతుందని గడ్కరీ వివరించారు. విజయవాడ బెంజిసర్కిల్‌ రెండో ఫ్లైఓవర్‌తో పాటు నిర్మాణం పూర్తయిన పలు జాతీయ రహదారులను సీఎం జగన్, గడ్కరీ ప్రారంభించారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story