Julakanti Brahmareddy: పోలీసులు సజ్జల ఆదేశాలు పాటిస్తున్నారు

Julakanti Brahmareddy: పోలీసులు వైసీపీకి వత్తాసు పలుకుతున్నారు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 23 May 2024 2:18 PM IST
The Police Are Following Orders Of Sajjala
X

Julakanti Brahmareddy: పోలీసులు సజ్జల ఆదేశాలు పాటిస్తున్నారు

Julakanti Brahmareddy: పల్నాడులో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. టీడీపీ చలో మాచర్లకు పిలుపునివ్వడంతో..ఆ పార్టీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే మాచర్ల కూటమి అభ్యర్థి బ్రహ్మరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో వైసీపీ, పోలీసుల తీరుపై బ్రహ్మారెడ్డి మండిపడ్డారు. చలో మాచర్లకు అనుమతి లేదంటూ పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబట్టారాయన. గాయపడిన కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేయకపోతే మాచర్ల వదిలి పారిపోవాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించిన జూలకంటి.. ఇప్పటికీ పోలీసులు వైసీపీ నాయకులకు మద్దతు పలుకుతున్నారని ఆరోపించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story