ఏపీలో జోరుగా సాగుతున్న పంచాయతీ పోరు

*బంధాలు.. అనుబంధాలకతీతంగా పల్లె పోరు *ప్రకాశం జిల్లా కుంకలమర్రులో అక్కా చెల్లెళ్లు పోటీ *నేనున్నానంటూ రంగంలోకి దిగిన మరో దాయాది

Samba Siva Rao
Updated on: 8 Feb 2021 8:01 PM IST
ఏపీలో జోరుగా సాగుతున్న పంచాయతీ పోరు
X

బంధాలు .. అనుబంధాలకతీతంగా పల్లె పోరు సాగుతోంది. స్వయంగా అక్కా .. చెల్లెళ్లు హోరాహోరీగా తలపడుతుండగా.. నేనున్నానంటూ మరో దాయాది రంగంలోకి దిగారు. వీరికి ప్రధాన పార్టీలు మద్దతు తెలుపుతుండడం ఆసక్తి రేపుతోంది.

ఏపీ పంచాయతీ పోరు రంజుగా సాగుతోంది. గెలుపు కోసం అభ్యర్థులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. బంధువులకు అతీతంగా పోటీ సాగుతోంది. ప్రకాశం జిల్లాలోని కారంచేడు మండలం కుంకలమర్రుకు చెందిన ఈదర రాజకుమారి, ఈదర సౌందర్య అక్కా చెల్లెళ్లు. ఇద్దరికీ గ్రామంలోని దగ్గరి బంధువులతో వివాహం జరిగింది. మొన్నటి వరకూ ఆ రెండు కుటుంబాలూ ఒకే పార్టీలో ఉన్నాయి. సర్పంచి పదవిని ఇద్దరూ ఆశించి చెరో పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్నారు.

ఈదర రాజకుమారి టీడీపీ, చెల్లెలు సౌందర్య వైసీపీ మద్దతుతో సర్పంచి అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. వీరి బంధువు ఈదర చంద్రిక జనసేన తరఫున సవాల్‌ విసురుతున్నారు. పార్టీ రహితమైనా తమ వారిని గెలిపించుకునేందుకు ఆయా పార్టీల శ్రేణులు రంగంలోకి దిగి ప్రచారం హోరెత్తిస్తున్నాయి. ఇద్దరూ తెలిసిన వారే కావడంతో ఎవరికి మద్దతు పలకాలో తెలియక ఆగ్రామంలోని బంధువులు ఇబ్బంది పడుతున్నారు. ఓటు అభ్యర్థించేందుకు వస్తున్న ముగ్గురికీ బంధువులు భరోసా ఇస్తుండడంతో ఎవరు గెలుస్తారో అన్నది ఆసక్తిగా మారింది. ఒకే కుంటుంబం మధ్య జరుగుతున్న ఈ పంచాయతీ పోటీ... జిల్లా వ్యాప్తంగా ఆసక్తిగా మారింది. గెలుపు ఎవరిదోనని అందరూ అసక్తగా ఎదురుస్తున్నారు.




Samba Siva Rao

Samba Siva Rao

Next Story