Konaseema: కోనసీమలో ప్రభుత్వ ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన

Konaseema: ఫోన్ సంభాషణల్లో బయటపడిన భాగోతం

Sandeep Eggoju
Updated on: 27 Nov 2021 12:04 PM IST
The Obscene Behavior of a Government Teacher in Konaseema
X

కోనసీమ ఎస్ యానామ్ ప్రభుత్వ ఉపాద్యాయుడు

Konaseema: పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు కీచకుడిగా మారాడు. అమ్మఒడి పథకం పేరుతో విద్యార్థినులకు, వారి తల్లులకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నాడు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలంలోని ఎస్.యానం జడ్పీ హైస్కూ‌ల్‌లో వెలుగులోకి వచ్చింది. ఇంగ్లీష్ టీచర్‌గా పనిచేస్తున్న మల్లేశ్వరరావు డబ్బులు ఆశ చూపి విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవరిస్తున్నాడు. వారి తల్లులకు సైతం ఫోన్లు చేసి వేధిస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన కాల్ రికార్డింగ్‌లు వైరల్ అవుతున్నాయి. కీచక ఉపాధ్యాయుడు మల్లేశ్వరరావుపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story